వార ఫలాలు 08-08-2021 నుండి 14-08-2021 వరకు

Astrology from august 8th to14th.వార ఫలాలు 08-08-2021 నుండి 14-08-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 4:17 AM GMT
వార ఫలాలు 08-08-2021 నుండి 14-08-2021 వరకు

మేషం రాశి :

ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు పితృ వర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు సంతానం విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వార ప్రారంభంలో బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి ఆదాయానికి లోటు ఉండదు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి పరిష్కారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాతృ వర్గ బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంతానం విద్యా విషయాలలో ముందంజలో ఉంటారు భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

పరిహారం : ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి:

ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నది అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు అవసరానికి బంధు మిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకొంటారు దాయాదులతో వివాదాలు లో విజయం సాధిస్తారు సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు పోటీపరీక్షలకు మరింత కష్టపడవలసి వస్తుంది. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు వారం చివరన ఇతరులకు ధన పరమైన విషయాలలో మాట ఇవ్వటం మంచిది కాదు ప్రతీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమున శుభకార్య విషయంలో ధనవ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా విషయాల లో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు వ్యాపారపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి మాసం చివరన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ప్రతీ వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి. జీవితభాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది మాసం మధ్యలో బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్ధిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులు స్వల్ప కష్టముతో అధిక ఆదాయం పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వార ప్రారంభంలో స్థానచలన సూచనలు ఉన్నవి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : దుర్గా ద్వాత్రింశన్నామవలి పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి:

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఇంటా బయట అందరిని ఒక తాటిపైకి తీసుకువస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు జరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సమాజంలో పేరుకలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి.

పరిహారం : గణపతిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయట పడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలాకాలంగా రావలసిన బకాయిలు వసూలవుతాయి ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

పరిహారం : రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

ఈ వారం కుడా అంతగా అనుకూలించదు. చేపట్టిన పనులలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదిoపులు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకి తగ్గిన ఫలితం లభించదు. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్ర హారాలు ఉండవు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు చేస్తారు. ఆర్థిక వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

పరిహారం : విష్ణు సహస్త నామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి:

ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరులను విమర్శించడం మానుకోవాలి.కుటుంబ వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలచివేస్తాయి. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేస్తారు.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీనం రాశి:

వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. గృహమున విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story