వార ఫలాలు 01-08-2021 నుండి 07-08-2021 వరకు

Astrology from August 1st to 7th.వార ఫలాలు 01-08-2021 నుండి 07-08-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2021 4:56 AM GMT
వార ఫలాలు 01-08-2021 నుండి 07-08-2021 వరకు

మేషం రాశి :

తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుండి విముక్తి పొందుతారు స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి వ్యాపారస్తులకు ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నవి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చిన్న తరహా పరిశ్రమ నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు వారం మధ్యలో ధనవ్యయం సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు కలుగుతాయి ఉంటాయి.

పరిహారం: గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం రాశి :

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన వాహన యోగం ఉన్నది గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో పనులు సకాలంలో పూర్తికావు వ్యయ ప్రయాసము తో గాని పనులు పూర్తికావు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం: గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథునం రాశి:

చేపట్టిన పనులు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో బంధువుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది చిన్నతరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం: శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం రాశి :

కొన్ని వ్యవహారాలలో తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి అనుకున్న పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు బంధుమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. రాజకీయ సంబంధ వ్యవహారాలలో అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు అధికమవుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి

పరిహారం: ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది తెలివితేటలతో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు నూతన వాహన కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి సంతాన విద్యా విషయాల శుభ వార్తలు అందుకుంటారు. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

పరిహారం: విష్ణు సహస్రనామస్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు గృహమున శుభకార్యాలకు వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో మరింత అనుకూలత పెరుగుతుంది. అన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ సమస్యలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం: సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలనుండి తెలివిగా బయటపడతారు స్ధిరాస్తి వివాదాలు సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు గృహ నిర్మాణయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార పరంగా మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి ఉపశమనం పొందుతారు చిన్నతరహా పరిశ్రమలవారు స్వల్ప లాభాలు అందుకుంటారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

పరిహారం: దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి:

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కీలక వ్యవహారాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఇంటా బయట మీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి రాజకీయ సంబంధిత సభ సమావేశాలు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.వారంతమున కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

పరిహారం: గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

ఆశించిన విధంగా పనులు పూర్తవుతాయి ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు కొన్ని వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వారం మధ్యలో దూరపు బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో శుభ ఫలితాలుంటాయి వృత్తి వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ధన పరమైన చిక్కులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం: నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి:

వారం ప్రారంభంలో సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా ముందుకు సాగుతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు ఇంటా బయట పరిచయాలు మరింత పెరుగుతాయి స్ధిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వారం ప్రారంభంలో ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం: ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది పాత మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు తరువాతి కాలానికి ఉపయోగపడతాయి. దూరపు బంధువుల ఆగమన ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారంలో ఉన్న వివాదాలు సమసిపోతాయి. అన్ని రంగాల వారు మరింత పురోగతి సాధిస్తారు. వారం చివరలో ఆర్థికంగా ఇబ్బందులుంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో అలోచించి మాట్లాడటం మంచిది.

పరిహారం: నవగ్రహ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

మీనం రాశి:

ఆర్థిక పరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టే పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. కొన్ని వ్యవహారాలలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై కొంత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపార విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. వారం మధ్యలో దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం: వారం చివరన హయగ్రీవ స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story