వారఫలాలు 10-04-2022 నుంచి 16-04-2022 వరకు
Astrology from April 10th to 16th.వారఫలాలు 10-04-2022 నుంచి 16-04-2022 వరకు
By తోట వంశీ కుమార్ Published on 10 April 2022 8:25 AM ISTమేష రాశి : చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ కొనుగోలు ప్రయత్నాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు కష్టానికి తగిన ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలుంటాయి. చిన్నతరహా పరిశ్రమల ప్రయత్నాలు ఫలించవు. కొన్ని రంగాల వారికి ఊహించని సమస్యలు ఉంటాయి వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృషభం రాశి : చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలుకు కుటుంబ సహాయం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ఋణ దాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట అందరకి మీ ఆలోచనలు నచ్చుతాయి.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.
పరిహారం : హయగ్రీవ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి : చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు దైవ సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వారం మధ్యలో ఒక సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజి అవుతాయి స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థత చాటుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల లాభాల బాటలో సాగుతాయి వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి : చేపట్టిన వ్యవహారలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆప్తుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
పరిహారం : శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
సింహ రాశి : ధన వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి ఆత్మీయులతో అకారణ వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు.సంతాన ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరుత్సహాపడతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
పరిహారం : మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
కన్య రాశి : చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. చుట్టుపక్కలవారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంత మందగిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖల పరిచయాలు విస్తృతమౌతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆర్థిక వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారము ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. వారం ప్రారంభంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి :నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో సఖ్యత కలుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభ వార్తలు అందుతాయి. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చాగలుగుతారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.
పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి : కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. వివాదాలకు సంభందించి ఆత్మీయుల నుంచి అందిన సమాచారంతో ఊరట కలిగిస్తుంది. నూతన వ్యక్తులు పరిచయాలతో మరింత ఉత్సాహనిస్తాయి. ఆర్థిక లావాదేవీలు క్రమ క్రమంగా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో మాటపట్టింపులుంటాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
పరిహారం :మేధో దక్షిణమూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
ధనస్సు రాశి : కుటుంబసభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది గృహ నిర్మాణ.ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు బందు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చిన్న తరహా పరిశ్రమల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వారం మధ్యలో ఇతరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
మకర రాశి : ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సోదరులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. నిరుద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి లభించాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో దూరమవుతాయి వారం మధ్యలో ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.
పరిహారం : ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
కుంభ రాశి : ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల అధిగమిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలు అరుదైన లాభాలు అందుతాయి. వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
మీన రాశి : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడి పాత రుణాలు తీసుకోగలుగుతారు. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి భూవివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి బయట పడతారు. చిన్న తరహా పరిశ్రమల వారికీ అనుకూల ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
పరిహారం : లక్ష్మీ నరసింహ అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.