వారఫలాలు తేది 29-01-23 నుంచి 04-02-23 వరకు
Astrology from 2023 January 29th to February 4th.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2023 1:47 AM GMTమేష రాశి : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
పరిహారం : గణపతి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృషభ రాశి : అధికారుల నుండి అందిన ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులను సైతం మీకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. అవసరానికి ఆదాయం సమకూరుతుంది. కొన్ని వ్యవహారాలలో బందు మిత్రులతో చర్చలు చేస్తారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్నతరహా పరిశ్రమల వారు నష్టాల నుండి బయట పడతారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మాటలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.
పరిహారం : శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి : కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో వివాదాలు ఉన్నపటికీ క్రమంగా సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల సహాయం అందుతుంది . ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో స్థిరస్తి వివాదాల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి : మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. చాలకాలంగా వేదిస్తున్న కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు.
పరిహారం : ఆదిత్య హృదయస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సింహ రాశి : ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో కీలక సమాచారం అందుతుంది. తెలివిగా వ్యవహరించి కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందడుగు సాగి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. అన్నిరంగాల వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి.
పరిహారం : ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కన్య రాశి : ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
పరిహారం : మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
తుల రాశి : క్రమక్రమంగా పరిస్థితులు సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అవసరానికి అదనపు ఆదాయం సమాకూరుతుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఉద్యోగాలలో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి : ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. స్సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయం అందుతుంది. అన్ని రంగాల వారికి వారం మధ్యలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.
పరిహారం : దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
ధను రాశి : ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. చిన్ననాటి మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి కొంత ఊరట లభిస్తుంది. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున ఇతరుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు.
పరిహారం :మేధో దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మకర రాశి : స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి నూతన లాభాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప ఆరోగ్య సమస్యలు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి.
పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కుంభ రాశి : దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
పరిహారం : గణపతి స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మీన రాశి : స్థిరాస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలలో అంచనాలు ఫలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహ నిర్మాణప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకసాములు పొందుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
పరిహారం : లక్ష్మి నరసింహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.