వార ఫలాలు 22-01-2023 నుంచి 28-01-2023 వరకు
Astrology from 2023 January 22nd to 28th.గృహమున శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు.
By జ్యోత్స్న Published on 22 Jan 2023 7:16 AM ISTమేష రాశి : గృహమున శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్థులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మంచి మాటతీరుతో ఇంటాబయట అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరన స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి : ముఖ్యమైన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.
పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశి : చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణకు అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో మనస్పర్ధలు కలుగుతాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి.
పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి : సోదరులతో వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకూ బయటపడతారు. వారం మధ్యలో చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలను గురించి చర్చిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితలు పొందుతారు.
సింహ రాశి : వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు భాధ్యతలుంటాయి. కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది బంధుమిత్రుల వియోగం బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వారాంతమున నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు ఇవ్వాల్సి వస్తుంది. దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి.
పరిహారం : గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశి : బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు నూతన లాభాలు అందుతాయి.చిన్ననాటి మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగుల కష్టం ఫలించి అవకాశాలు లభిస్తాయి. వారాంతంలో బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలలో విజయం సాధిస్తారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు.
పరిహారం : ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి : నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆప్తులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ విషయమై ప్రతిబంధకాలు తొలగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి కొంతవరకు బయట పడతారు. కీలక వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు.
పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి : ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. ముఖ్యమైన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి లాభాల అందుకుంటారు. వారాంతమున బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు.
పరిహారం : సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధను రాశి : చిన్న తరహా పరిశ్రమలు లాభాల బాట పడతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశి : కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ధన పరంగా ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ వేగవంతం చేస్తారు. వ్యాపార విషయంలో తెలివిగా వ్యవహరించి మంచి లాభాలను అందుకుంటారు.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి : ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సహకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వారం ప్రారంభంలో ఇతరులతో వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు అందుతాయి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దీర్ఘ కాలిక ఋణ బాధలు తొలగుతాయి.
పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి : బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చిన్నతరహా పరిశ్రమల వారు విశేషమైన ఆదరణ పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి లభిస్తుంది. వారం మధ్యలో కొన్ని పనులు నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.
పరిహారం : వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.