వార ఫలాలు 15-01-2023 నుంచి 21-01-2023

Astrology from 2023 January 15th to 21st.చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు.

By జ్యోత్స్న  Published on  15 Jan 2023 1:58 AM GMT
వార ఫలాలు 15-01-2023 నుంచి 21-01-2023

మేష రాశి : చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. సన్నిహితులనుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చాలాకాలంగా ఉన్న సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. నూతన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథున రాశి : దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వారం చివరన ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

పరిహారం : కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : గృహ నిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు. వారం చివరలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు.

పరిహారం :హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్య రాశి : ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల ఆకస్మిక కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. దాయదులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందాయి. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి : గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట నూతనోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

పరిహారం : లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. గృహమున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు.

పరిహారం : ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి : కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

పరిహారం : ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story