వార ఫలాలు తేది 19-02-2023 నుంచి 25-02-2023 వరకు

Astrology from 2023 February 19th to 25th.జీవిత బాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

By జ్యోత్స్న  Published on  19 Feb 2023 6:54 AM IST
వార ఫలాలు తేది 19-02-2023 నుంచి 25-02-2023 వరకు

మేష రాశి : జీవిత బాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి.ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

పరిహారం : దుర్గా కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలో ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

పరిహారం : దుర్గాష్టకం పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు కలలు సాకారం అవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ కారావలంభ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి.

పరిహారం : అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు భాదిస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహప్రవేశం నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థాన చలన సూచనలున్నవి.

పరిహారం : అర్దనారీశ్వర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : చిన్న త్వరగా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయట పడతారు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం : గణేష కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యలను రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

పరిహారం : రామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

పరిహారం : శ్రీ నారాయణ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి : సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు నుండి బయటపడతారు సోదరుల నుండి స్థిరాస్థి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

పరిహారం : పంచముఖ హనుమత్కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. గృహమును కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వారంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి : వారం ప్రారంభంలో ధన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రంగాలవారు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story