వార ఫలాలు 25-12-2022 to 31-12-2022 వరకు
Astrology from 2022 December 25th to 31st.చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు
By జ్యోత్స్న Published on 25 Dec 2022 7:25 AM ISTమేష రాశి :చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది. కీలక విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి.
పరిహారం : హనుమాన్ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృషభ రాశి : ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా నిదానంగా మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులంటాయి.
పరిహారం : విష్ణు సహస్రనామా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మిథున రాశి : ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమ క్రమంగా మెరుగుపడుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమయస్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విబేధాలుంటాయి.
పరిహారం : శ్రీరామ ఆపదుద్దారక స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి : చిన్ననాటి మిత్రుల సహాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. ఆప్తులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
పరిహారం :లక్ష్మి కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
సింహ రాశి : వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణ కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులతో చర్చలు సఫలమౌతాయి.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కన్య రాశి : గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పాత ఋణాలు కొంత వరకు తొలగుతాయి. బంధుమిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
పరిహారం : దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
తుల రాశి : నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
పరిహారం : మేధో దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి : గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.
పరిహారం : గణేష కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి : వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత వరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అందరిని మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. చిన్నతరహా ప్రయత్నాలు సఫలమౌతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బందువులతో వివాదాలు కొంత బాధిస్తాయి.
పరిహారం : లక్ష్మి నృసింహ కరావలంభ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మకర రాశి : వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు అమలుపరుస్తారు. గృహ వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరస్తి వివాదాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి తగింత లాభాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగాలలో నూతన విధులు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని పనులు వ్యయప్రయాసలతో పూర్తి కావు. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
పరిహారం : శ్రీ బాల పంచరత్న స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కుంభ రాశి : ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహణపై చర్చలు జరుపుతారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధు మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో కలహా సూచనలున్నవి.
పరిహారం : శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మీన రాశి : భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమౌతాలు అందుతాయి. సన్నిహితుల నుండి శుభవార్త. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదులుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.