వారఫలాలు తేది 18-12-2022 నుంచి 24-12-2022 వరకు

Astrology from 2022 December 18th to 24th.ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు

By జ్యోత్స్న  Published on  18 Dec 2022 7:07 AM IST
వారఫలాలు తేది 18-12-2022 నుంచి 24-12-2022 వరకు

మేష రాశి : ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రణాళికలతో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. వారం చివరిలో స్వల్ప ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి.

పరిహారం : దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని రంగాల వారి అంచనాలు తప్పుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలలో నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. బంధువులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యుత్నాలు ముందుకు సాగవు.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో అనుకోని ఖర్చులుంటాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు తప్పవు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగి పాత ఋణాలు తీరుస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

పరిహారం : గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు .

కర్కాటక రాశి : ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. చిన్నతరహా పరిశ్రమల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో బంధు వర్గంతో విరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా నూతన అవకాశములు దక్కుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరిగి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వారం చివరిలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

పరిహారం : సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికి అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్నతరహా పరిశ్రమల అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

పరిహారం : మధురష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. మంచి మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. స్థిరస్తి వివాదాల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

పరిహారం : రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత వరకు తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాలకాలంగా పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమంగా అధిగమిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఆప్తుల నుండి ఋణ నుండి ఒత్తిడి పెరుగుతుంది. సోదరులతో స్థిరస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

మేధో పరిహారం : దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : అనుకున్న పనులు కొంత నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని సమస్యలను క్రమ క్రమంగా పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇతరులతో అకారణ వివాదాలుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.

పరిహారం : లలిత సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఉద్యోగాలలో ఒత్తిడులు పరిష్కారమౌతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని వ్యవహారాలలో చాలకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఋణ బాధలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు సమకూరతాయి. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని పనులు ప్రారంభిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధన పరమైన ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

పరిహారం : వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : సోదరులతో విభేదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. అన్ని రంగాల వారికి చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వారం ప్రారంభంలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

పరిహారం : శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story