వార ఫలాలు తేది 05-03-2023 నుంచి 11-03-2023 వరకు
స్థిరాస్తి వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
By జ్యోత్స్న Published on 5 March 2023 1:38 AM GMTఈ వారం రాశి ఫలాలు
మేష రాశి : స్థిరాస్తి వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. మిత్రుల నుండి శుభవార్త అందుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. కీలక వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమున శుభకార్య నిర్వహణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
పరిహారం : సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి : ఉద్యోగ విషయమై కోరుకున్న విధంగా స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి పెద్దవారి నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వారం చివరన శ్రమ పెరుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు పరుస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.
పరిహారం : గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశి : సంతానం విద్యా విషయాలలో శుభఫలితాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల గురించి చేసే ఆలోచనలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుని అవసరాలు తీర్చుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు.
పరిహారం : నవగ్రహ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి : సంతాన వివాహ శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. నిరుద్యోగులకు అవాంతరాలు తొలగి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ విషయంలో పై అధికారులతో సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వివాదాలు పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో మిత్రులతో చిన్నపాటి కలహా సూచనులున్నవి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు.
పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహ రాశి : కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చాలకాలంగా బాదిస్తున్న సమస్యలు క్రమం క్రమక్రమంగా తొలగి పరిస్థితులు అనుకూలిస్తాయి ఆప్తులతో గృహమున సరదాగా గడుపుతారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో కానీ ఫలితం కనిపించదు. కొన్ని వ్యవహారాలలో బంధువుల సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు.
పరిహారం : కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన పొందుతారు శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశి : దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను పెంచుకుంటారు. స్ధిరాస్తి లాభాలు పొందుతారు. విద్యార్థుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. నూతన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో సహచరులతో మాట పట్టింపులు తొలగుతాయి.
పరిహారం : రామారక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాన్ని పొందుతారు.
తుల రాశి : వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు అంది విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలను అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాదిస్తారు. సంతానం విద్యా విషయాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వారం చివరన పనులలో శ్రమ కలుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. స్థిరస్తి వ్యవహారంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణాలు తీరుస్తారు.
పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి : దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. స్నేహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటాబయట మీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు కుటుంబసభ్యులతో సఖ్యత పెరుగుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి.
పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి : కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. గృహమునకు బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు చిన్ననాటి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి.
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశి : మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నం సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు ఆత్మీయులతో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అవసరానికి చేతికందుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగ ఈ విషయంలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఊరట పొందారు. కొన్ని రంగాల వారికి విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాల లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు.
పరిహారం : లింగాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.
కుంభ రాశి : వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులువాయిదా పడతాయి. కుటుంబ ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభసూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
పరిహారం : లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.
మీన రాశి : నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో అంచనాల అందుకుంటారు. ఉద్యోగ విషయమై అధికారులతో సమస్యలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమునకు సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల వాతవరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలను అందుతాయి.
పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.