వార ఫలాలు తేది 26-02-2023 నుంచి 04-03-2023 వరకు

కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి

By జ్యోత్స్న  Published on  26 Feb 2023 7:11 AM IST
వార ఫలాలు తేది 26-02-2023 నుంచి 04-03-2023 వరకు

మేష రాశి : కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి .ధన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

పరిహారం : హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.

పరిహారం :దేవి ఖడ్గ మాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి : సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకొన్న సమయానికి ధనసహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

పరిహారం : ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి.

పరిహారం : వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి : ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాలవారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడంలో విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలో స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందవు. చేపట్టిన పనులలో కార్య సిద్ధి కలుగుతుంది.

పరిహారం : శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయటపడతారు.

పరిహారం : లక్ష్మి నరసింహ స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. తల్లితండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్ధిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

పరిహారం : సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు.

మీన రాశి : గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. సోదరులతో భూవివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

పరిహారం :ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story