సౌర పంచాంగం ప్రకారం.. సంక్రాంతి అంటే అర్థం ఇదే

సౌర పంచాంగం ప్రకారం.. సంక్రాంతి అంటే నెల ప్రారంభం అని అర్థం. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు.

By అంజి  Published on  12 Jan 2025 8:00 AM IST
solar almanac, Sankranti, Sun, Capricorn

సౌర పంచాంగం ప్రకారం.. సంక్రాంతి అంటే అర్థం ఇదే

సౌర పంచాంగం ప్రకారం.. సంక్రాంతి అంటే నెల ప్రారంభం అని అర్థం. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు. అలా సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అని అంటారు. ఇద ప్రతి సంవత్సరం జనవరి 13, 14 తేదీల్లో జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడన్న మాట.

ఇది జూన్‌ 20 (సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే) వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత (జూన్‌ 21న) దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. ఆ టైమ్‌లో సూర్యుడు దక్షిణంవైపు ప్రయాణం చేస్తాడు. ఈ మధ్యకాలంలో వర్షాకాలం, చలికాలాలు వస్తాయి. ఉత్తరాయణం కాలంలో సూర్య కిరణాల తీవ్రత పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా.. మెల్లమెల్లగా మొదలవుతాయి. అయితే సైన్స్‌ ప్రకారం భూమికి సంబంధించి సూర్యుడు ఎటూ కదలడు. జ్యోతిష్య పండితుల భావన ప్రకారం సూర్యుడు రాశులు మారుతున్నాడని చెబుతారు.

Next Story