'అస్త్ర' వదిలితే అంతమే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Sep 2019 2:50 PM GMTఢిల్లీ: భారత రక్షణ రంగం రోజురోజుకు బలోపేతమవుతోంది. తాజాగా భారత వైమానిక దళం అస్త్ర మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. అస్త్ర మిస్సైల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. అస్త్రను సుఖోయ్ -30ఎంకేయు యుద్ధ విమానం నుంచి పరీక్షించారు. ఒడిశా తీరం నుంచి అస్త్ర మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఆకాశంలో 70 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఏమాత్రం గురి తప్పకుండా అస్త్ర ధ్వంసం చేసిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓకు అభినందనలు తెలిపారు.
అస్త్రకు ఉన్న ప్రత్యేకతలు
1. 70 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఎయిర్ టు ఎయిర్ ధ్వంసం చేయగలదు.
2. గంటకు 5వేల 555 కి.మీ వేగంతో లక్ష్యంగా దిశగా దూసుకెళ్తుంది.
3.15 కిలోల పేలుడు పదార్ధాలను అస్త్ర మోసుకెళ్తుంది.
4.ప్రముఖ విశ్వ విద్యాలయాల సహకారంతో డీఆర్‌డీఓ ఈ మిస్సైల్ తయారు చేసింది.
Next Story