'అశ్వథ్థామ'కి పూరి సపోర్ట్.. నాగశౌర్య కెరీర్ కష్టమే !

By Newsmeter.Network  Published on  21 Jan 2020 2:55 PM GMT
అశ్వథ్థామకి పూరి సపోర్ట్.. నాగశౌర్య కెరీర్ కష్టమే !

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా 'అశ్వథ్థామ' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను జనవరి 23న సాయంత్రం 5 గంటల 04 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఇక ఇప్పటికే సమంత ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది.

అయితే టీజర్ లో నాగశౌర్య కాస్త ఓవర్ యాక్షన్ చేయడం, దానికితోడు టీజర్ లో మెయిన్ గా మాస్ హీరో రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ షాట్స్ ఉండటంతో సినిమా పై ఒకింత డౌట్ గానే ఉంది ఆడియన్స్ కు. అయినా నాగశౌర్య మీద కామెడీనో లవ్ స్టోరీనో చూస్తారు గాని, యాక్షన్ అంటే ఎవరు చూస్తారు ? కానీ చిత్రబృందం మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మా టీజర్ కి మంచి స్పందన వచ్చిందని డప్పులు బాగానే కొట్టింది. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అశ్వథామ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం అందించారు. కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట.

కాగా నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. అన్యాయాన్ని ప్రశ్నించి.. ఎదిరించేవాడిగా నాగశౌర్య ఈ సినిమాలో కనిపిస్తాడట. ఈ అన్యాయాలను ఆపటం లాంటి రొట్ట కొట్టుడు కథలు ఇప్పటికే వెగటు పుట్టిస్తున్నాయి. అయినా ఈ సినిమాలనే ఎందుకు తీస్తారో..? ఏమైనా ఈ సినిమా సక్సెస్ కాకపోతే నాగశౌర్య కెరీర్ కష్టమే.

Also Read

Next Story
Share it