'ఆర్ఆర్ఆర్' న్యూ అప్ డేట్..ఎన్టీఆర్ తో అజయ్ దేవగన్ ఎమోషనల్ !

By రాణి  Published on  21 Jan 2020 12:03 PM GMT
ఆర్ఆర్ఆర్ న్యూ అప్ డేట్..ఎన్టీఆర్ తో అజయ్ దేవగన్ ఎమోషనల్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ సినిమాని భారీ లెవల్లో రూపొందిస్తున్నారు జక్కన్న. మెయిన్ గా సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసం అన్ని పరిశ్రమల నుండి స్టార్స్ ను తీసుకున్నారు. బాలీవుడ్ నుండి క్యూట్ బ్యూటీ ఆలియాతో పాటు మాస్ స్టార్ అజయ్ దేవగన్ ను కూడా తీసుకున్నారు. అయితే అజయ్ దేవగన్ మంగళవారం హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అజయ్ దేవగన్ కి ఎన్టీఆర్ కి మధ్య ఎమోషనల్ సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా సినిమాలో సెకెండ్ హాఫ్ లో అజేయ్ దేవగన్ రోల్ వస్తోందట. ఎక్కువుగా ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఆయన సీన్స్ ఉంటాయట. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో ప్రత్యేకంగా కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో తమిళ్ యాక్టర్ సముద్రఖని నటిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 30, 2020 లో విడుదల కానుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి' సిరీస్ అనంతరం రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story
Share it