మ‌హేష్ మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ ప్రారంభం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 4:51 AM GMT
మ‌హేష్ మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ ప్రారంభం

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా తొలి చిత్రం సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, రానా ద‌గ్గుబాటి, హీరో సుధీర్ బాబు, ఆది శేషగిరిరావు, పార్లమెంట్ స‌భ్యులు రామ్మోహ‌న్ నాయుడు, కేశినేని నాని, న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, అమ‌ల అక్కినేని, న‌మ్ర‌త శిరోద్క‌ర్, సుశాంత్, త‌దిత‌రులు పాల్గొన్నారు. సినిమా ముహూర్తపు స‌న్నివేశానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్లాప్ ఇవ్వ‌గా రానా ద‌గ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, గ‌ల్లా అరుణ‌కుమారి, ప‌ద్మావ‌తి గ‌ల్లా, జ‌య‌దేవ్ గ‌ల్లా స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య‌కు అందించారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీని అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లోగోను ఆవిష్క‌రించారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అశోక్ గ‌ల్లాకు ఆల్ ది బెస్ట్‌. గల్లా జ‌య‌దేవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. న‌న్ను సోద‌రుడిలా ట్రీట్ చేస్తుంటారు. ఆయ‌న నిర్మాత‌గా అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. ప‌ద్మావ‌తి, అశోక్‌కి, హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఆల్ ది బె వెరీ బెస్ట్‌ తెలిపుతున్నాను.

హీరో రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ.. అశోక్ గ‌ల్లాకి ఆల్ ది వెరీ బెస్ట్, మంచి కథ, కథనాలతో ఇండ‌స్ట్రీలోకి పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. నిర్మాత‌గా ప‌ద్మ లెగ‌సీని కంటిన్యూ చేస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్‌ తెలుపుతున్నాను.

Next Story