లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఓవైసీ ట్వీట్‌

By సుభాష్  Published on  12 April 2020 9:33 AM GMT
లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఓవైసీ ట్వీట్‌

కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తున్న వేళ.. 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది కేంద్రం. దీంతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ ముగియనుండగా, ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో కేంద్రం నుంచి కూడా లాక్‌డౌన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని మోదీకి సూచించారు. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ముదుగానే ప్రకటించగా, నిన్న కేసీఆర్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ ఓ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ పొడిగించాలనుకుంటే ముందుగా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాదు ప్రతీ కార్మికుడికి రూ.5వేలు, అన్నార్థులకు సరిపడ ఆహారం అందించడం, వలస కూలీలకు, నిరుపేదలను ఆదుకునేందుకు అన్ని రాష్ట్రాలకు సరిపోయే నిధులు అందజేయాలని అన్నారు

ఓవైసీ చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైనార్టీలందరూ కూడా సామూహికంగా ప్రార్థనలు చేయడం, మసీదులకు వెళ్లడం చేయరాదని అసదుద్దీన్‌ కోరిన విషయం తెలిసిందే.

Next Story