ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఉదయం నుండి నామినేషన్ల స్వీకరణ కూడా జ‌రుగుతుంది. ఈ నేఫ‌థ్యంలో ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన అధికార‌ ఆప్‌, ప్ర‌తిప‌క్ష‌ బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఒకేసారి 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్ర‌క‌టించి ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చారు. ఇదిలావుంటే.. సిట్టింగుల్లో 15 మందికి టికెట్‌ ఇచ్చేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు. ఇక‌ 46 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్‌ కేటాయించారు.

కాగా.. కేజ్రీవాల్‌ న్యూఢిలీ​ అసెంబ్లీ స్థానం నుంచి, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుండి బ‌రిలో ఉంటున్నారు. ఇక‌, 2015లో ఆరుగురు మహిళలకు టికెట్‌ కేటాయించగా.. ఈ సారి 8 మందికి అవకాశం కల్పించారు. పోలింగ్ కు ఇంకా 25 రోజుల సమయం ఉండటంతో ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి కేజ్రీవాల్ ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు కాగా, 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Aap1 Aap2 Aap3

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.