Fact Check : కేరళలో ఏనుగును చంపిన ఘటనలో ఇద్దరు ముస్లింలను అరెస్ట్ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 3:09 PM GMT
Fact Check : కేరళలో ఏనుగును చంపిన ఘటనలో ఇద్దరు ముస్లింలను అరెస్ట్ చేశారా..?

పాలక్కాడ్ జిల్లాలోని సైలెంట్ వ్యాలీలో టపాసులు నిండి ఉన్న పైన్ ఆపిల్ ను తిన్న ఏనుగు చనిపోయిన ఘటన పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఏనుగు కడుపుతో ఉందన్న విషయం తెలిసి మరింత కోపం వచ్చింది. ఈ ఘటనకు మతం రంగు పూసే పని పెట్టుకున్నారు కొందరు.

ముస్లింలు మెజారిటీగా ఉన్న జిల్లా మలప్పురం కావడంతో.. గర్భంతో ఉన్న ఏనుగు చనిపోడానికి ముస్లింలే కారణమంటూ వార్తలను వైరల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏనుగును చంపినందుకు ఇద్దరు ముస్లిం వ్యక్తులను అరెస్ట్ చేశారంటూ వార్తలు రావడం మొదలైంది.

యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ మీడియా అడ్వైజర్ అమర్ ప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

“Amzath Ali and Thamim Shaikh were arrested for the elephant killing case in Kerala. I demand the @CMOKerala to do the transparent investigation without any mercy based on religion, caste, or creed. On June 3, an FIR was lodged against unidentified people under relevant sections of the Wildlife Protection Act. Two people have been taken into custody. People who are asking source should demand @CMOKerala to reveal the FIR Copy,” Reddy tweeted.

M1

అంజాత్ అలీ, తమీమ్ షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని.. ఈ విచారణ అన్నది పారదర్శకంగా ఉండాలంటూ కేరళ ముఖ్యమంత్రిని ఆయన డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చేసిన ఆయన కొద్దిసేపటికే డిలీట్ చేయడం గమనార్హం. డిలీట్ చేసే సమయానికి వెయ్యికి పైగా రీట్వీట్స్ వచ్చాయి.

M2

సుప్రీం కోర్ట్ అడ్వొకేట్ ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్ కూడా అలాంటి పోస్టు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.

నిజనిర్ధారణ:

ఏనుగును చంపిన కేసులో ఇద్దరు ముస్లిం వ్యక్తులను అరెస్ట్ చేశారన్న అభియోగాలు పచ్చి అబద్ధం.

కేరళ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం.. ఎఫ్ఐఆర్ అన్నది గుర్తు తెలియని వ్యక్తులపై రిజిస్టర్ చేశారు. స్థానిక రైతైన విల్సన్ ను జూన్ 5వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. New Indian Express రిపోర్ట్ ప్రకారం ఈ ఘటనలో పాలుపంచుకున్న మిగిలిన వ్యక్తులను కూడా పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు. విచారణను కూడా ముమ్మరం చేస్తున్నారు.

ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. గురువారం నాడు ఆయన ట్వీట్ చేస్తూ ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా చేస్తామని అన్నారు.“An investigation is underway, focusing on three suspects. Police and forest departments will jointly investigate the incident. The district police chief and the district forest officer visited the site today. We will do everything possible to bring culprits to justice,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇక ఈ ఘటనకు మతం రంగు పూయడాన్ని ఆయన తప్పు పట్టారు. నిజం తెలుసుకోకుండా ఒకరిని అసహ్యించుకోవడం.. ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం చాలా తప్పని ఆయన అన్నారు. నిజం ఏమిటో త్వరలోనే తెలుస్తుందని.. పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ పనిలోనే ఉన్నారని ఆయన అన్నారు.

మే 27న ఆ ఏనుగు వెల్లియార్ నదిలో చనిపోయింది. సెక్షన్ ఆఫీసర్ మోహన్ కృష్ణ సోషల్ మీడియాలో షేర్ చేసిన దాని ప్రకారం.. ఆ ఏనుగు వెల్లియార్ నదిలో గాయానికి నీళ్లు పెట్టుకుంటూ మరణించింది. ఆ ఏనుగు నోట్లో టపాసులు పేలినప్పటికీ అది ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా నదిలోకి వెళ్ళిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్టుల ప్రకారం ఊపిరితిత్తుల్లోకి, శ్వాసనాళాల్లోకి నీళ్లు పోవడం వలన ఆ ఏనుగు మరణించింది.

ఏనుగును చంపిన కేసులో ఇద్దరు ముస్లిం వ్యక్తులను అరెస్ట్ చేశారంటూ వైరల్ అవుతున్న వార్తలు అబద్ధం.

Claim Review:Fact Check : కేరళలో ఏనుగును చంపిన ఘటనలో ఇద్దరు ముస్లింలను అరెస్ట్ చేశారా..?
Claim Fact Check:false
Next Story