Fact Check: నిజమెంత: బోస్టన్ పోలీసులు కావాలనే తమ కార్ ను ధ్వంసం చేశారా..?

By సుభాష్  Published on  5 Jun 2020 6:33 AM GMT
Fact Check: నిజమెంత: బోస్టన్ పోలీసులు కావాలనే తమ కార్ ను ధ్వంసం చేశారా..?

నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా గత వారం రోజులుగా అమెరికాలో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకు వస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల లూఠీలు చేయడంతో పరిస్థితి మరింత చేజారిపోయింది.



బోస్టర్ నగరంలో పోలీసు కారును ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. నిరసన కారులే పోలీసు కారును ధ్వంసం చేసారంటూ నిందమోపడానికి పోలీసులు తమ వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

అయిషా అనే ట్విట్టర్ యూజర్ “boston cops breaking their own car windows. What’s the excuse for this one?" అంటూ ట్వీట్ చేసింది.



పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా ఈ వీడియోను తమ తమ అకౌంట్స్ లో షేర్ చేశారు. పోలీసుల అతి కారణంగానే అమెరికాలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు.

నిజనిర్ధారణ:

వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అలాగే Boston cops destroying their own car అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా వీడియోలు దొరికాయి. అందులో నిరసనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం మనం గమనించవచ్చు. అప్పటికే నిరసనకారులు కారును ధ్వంసం చేయగా.. పోలీసులు కేవలం విండ్ షీల్డ్(ముందు అద్దం) ను పగులగొట్టి.. కారును అక్కడి నుండి తీసుకుని వెళ్లారు. పూర్తీ వీడియోలో మొత్తం ఉదంతాన్ని గమనించవచ్చు.

నిరసనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన వీడియోలను కూడా పలువురు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. ఆ ట్వీట్స్ మీరు చూడొచ్చు.

wcvb.com న్యూస్ వెబ్ సైట్ కథనం ప్రకారం.. బోస్టన్ పోలీసులు తమ కారును ధ్వంసం చేయలేదు. పోలీసులే వారి కారును ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని స్పష్టం చేశారు. బోస్టన్ పోలీసులు మాట్లాడుతూ.. నిరసనకారులు వాహనాన్ని అప్పటికే ధ్వంసం చేశారని.. ఆ కారును అక్కడి నుండి తీసుకుని వెళ్లాలని అనుకున్నామని.. ముందు అద్దం ధ్వంసం అవ్వడంతో వాహనాన్ని డ్రైవ్ చేయడం ప్రమాదకరమైనదని.. దీంతో ఆ ముందు అద్దాన్ని తొలగించి వాహనాన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయారు పోలీసులు.



“5 Investigates obtained another video that shows the protesters had already caused heavy damage to the vehicle. They jumped on the vehicle and smashed the windshield.” అంటూ ఆర్టికల్ లో రాసుకుని వచ్చారు.

బోస్టన్ పోలీసులు కావాలనే తమ కారును ధ్వంసం చేశారన్న వార్త 'పచ్చి అబద్ధం'. అంతకుముందే నిరసనకారులు కారును ధ్వంసం చేశారు.. పోలీసులు కేవలం విండ్ షీల్డ్ ను తీసేసి.. కారును అక్కడి నుండి తీసుకుని వెళ్లారు.

Claim Review:Fact Check: నిజమెంత: బోస్టన్ పోలీసులు కావాలనే తమ కార్ ను ధ్వంసం చేశారా..?
Claim Fact Check:false
Next Story