భూమా అఖిల ప్రియ భర్త అనుచరులు అరెస్ట్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 11:50 AM GMT
భూమా అఖిల ప్రియ భర్త అనుచరులు అరెస్ట్‌

హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌రావ్‌ చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ఈనే పథ్యంలో భార్గవ్‌రావు అనుచరులను ఏపీ పోలీసులు సోమవారం నగరంలో అదుపులోకి తీసుకున్నా రు. క్రషర్‌ వ్యవహారంలో కడప ఆళ్లగడ్డ ఠాణాలో భార్గవ్‌తోపాటు మరో పదిమందిపై హత్యాయత్నం కింద కేసులు నమోదయ్యాయి. దీంతో వారు నగరంలో తలదాచుకోగా బంజారాహిల్స్‌ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ రాష్ర్టానికి తీసుకెళ్లారు. అయితే కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులపై భార్గవ్‌తో పాటు అనుచరులు దురుసుగా ప్రదర్శించారని.. విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వస్తున్నాయి.

భార్గవ్ రామ్ కులం వల్లనే ఓడిపోయాననే మాటలు బాధించాయి: అఖిల

ఐదేళ్లలో చాలా రాజకీయాలు నేర్చుకున్నానన్నారు మాజీ మంత్రి అఖిల ప్రియ. ఎన్నికల్లో ఓడిపోవడం మంచిదేనన్నారు.ఎన్నికల్లో ఓడిపోవడం వలన ఎవరేంటో తెలుస్తుందన్నారు. పులివెందులకు వెళ్లి రాగానే కేసులు నమోదయ్యాయన్నారు. పోలీసులు తమ ఇంటికి వచ్చి ముగ్గురిని అరెస్ట్ చేశారనేది అవాస్తవమన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరిపై కూడా తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. జిల్లా ఎస్పీ పర్సనల్‌గా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా గవర్నర్‌కు ఇచ్చామన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నవారిని వదిలి పెట్టమన్నారు. తన కుటుంబసభ్యులకు ఏదైనా జరిగితే జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాలన్నారు అఖిల ప్రియ. వారెంట్ లేకుండా ఇల్లు సెర్చ్ చేయడం హీరోయిజం కాదన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా భయపడనన్నారు. యురేనియం తవ్వకాలపై వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు. బెయిల్ వచ్చినా తమను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అఖిల ప్రియ అభిప్రాయపడ్డారు.

Next Story