వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు..!- ఎపీ సీఎం వైఎస్‌ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 9:51 AM GMT
వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు..!- ఎపీ సీఎం వైఎస్‌ జగన్

అనంతపురం: రాష్ట్రం వెలుపుల ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటి ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ సేవలు వర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద నెలకు రూ. 5 వేలు చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్ ప్రకటించారు. తలపేమియా వ్యాధిగ్రస్తులకు జనవరి 1 నుంచి రూ.10వేల పింఛన్..పెరాలసిస్ వ్యాధిగ్రస్తులకు జనవరి 1 నుంచి రూ.5వేల పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మే వరకు నెట్ వర్క్‌ ఆస్పత్రుల్లో ఉన్న రూ.650 కోట్ల బకాయిల్లో రూ.500 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగతా డబ్బులు కూడా త్వరలో చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి నుంచి జూన్‌ 2022లోపు ఆస్పత్రుల్లో మార్పుకు శ్రీకారం చుడుతామన్నారు. వైద్య, విద్య, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురం జిల్లాకు తాను మనవడినని..జిల్లా మనవడిగా రూపురేఖలు మారుస్తానన్నారు. హంద్రీ- నీవాను 2,200 క్యూసెక్కుల నుంచి 6వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పదేళ్ల నాడు చెరువులు నిండాయి..మళ్లీ తమ ప్రభుత్వంలో చెరువులు నిండాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

Next Story
Share it