డైరెక్ట‌ర్ సంతోష్‌కి నాకు గొడ‌వ‌లు - హీరో నిఖిల్

By Newsmeter.Network  Published on  30 Nov 2019 12:44 PM GMT
డైరెక్ట‌ర్ సంతోష్‌కి నాకు గొడ‌వ‌లు - హీరో నిఖిల్

యువ హీరో నిఖిల్ తాజా చిత్రం అర్జున్ సుర‌వ‌రం. ఈ సినిమాకి టి.ఎన్. సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి అయితే... ఊహించ‌ని కార‌ణాల వ‌ల‌న చాలా సార్లు వాయిదా ప‌డింది. ఆఖ‌రికి ఈ నెల 29న రిలీజైంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నిఖిల్ గ‌త చిత్రాల కంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసే దిశ‌గా స‌క్స‌స్ ఫుల్‌గా ఈ చిత్రం ర‌న్ అవుతోంది.

అయితే ఈ స‌క్సస్ నేప‌థ్యంలో నిఖిల్ త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇంత‌టి విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా షూటింగ్ టైమ్ లో డైరెక్ట‌ర్ సంతోష్ తో గొడ‌వ‌లు జ‌రిగాయ‌న్నారు. ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు గొడ‌వ ప‌డ్డామన్నారు. అయితే స్వ‌యంగా నిఖిల్ ఈ విషయాన్ని మీడియా మీట్ లో చెప్ప‌డం విశేషం. తర్వాత ఈ సినిమా స‌మ‌ర్ప‌కుడు ఠాగూర్ మ‌ధు, నిర్మాత రాజ్ కుమార్, హీరో నిఖిల్, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి.. మూవీ సక్సెస్‌పై ఆనందం వ్య‌క్తం చేసారు.

Next Story
Share it