విలువిద్య క్రీడాకారిణులు మరోసారి మెరుపులు మెరిపించారు. విలువిద్య క్రీడాల్లో అద్భతంగా రానించారు. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వ్యక్తిగత రికర్వు పోటీల్లో స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌ పోరులో దీపికా కూమారి6-0 తో తన తోటి క్రీడాకారిణి అనికిత భకత్‌పై విజయం సాధించింది. దీంతో బంగారం పతకాన్ని ముద్దాడింది.
అయితే ఈ క్రీడలో రన్నరప్‌గా నిలిచిన అనికతకు రజతం దక్కింది.

అయితే ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ సెమీస్‌ చేరడంతోనే వీరిద్దరికి ఒలింపిక్స్‌ వ్యక్తిగత రికర్వు పోటీలకు అర్హత లభించిన విషయం తెలిసిందే. ఈమేరకు సెమీస్‌లో భుటాన్‌కు చెందిన కర్మను అనికత ఓడించింది. అలాగే వియత్నంకు చెందిన గుయెత్‌ డుతిఅన్‌ను దీపక కూమారి ఓడించింది. దీంతో విలువిద్య క్రీడల్లో భారత్‌కు ఓ స్వర్ణం, ఓ రజతం దక్కాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.