అదిరిపోయేలా రానా 'అరణ్య' టీజర్..!

By అంజి  Published on  13 Feb 2020 11:17 AM GMT
అదిరిపోయేలా రానా అరణ్య టీజర్..!

దగ్గుబాటి రానాకు దక్షిణాదినే కాకుండా బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రానా హీరోగా నటించిన సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్క సినిమా అభిమాని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. రానా కూడా తన సినిమాలంటే రొటీన్ గా ఉండకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి..! క్యారెక్టర్ కోసం శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టగలడు. అలాంటి సినిమాతోనే అతి త్వరలో వెండితెరపై సందడి చేయనున్నాడు.

రానా దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం 'హాథీ మేరే సాథీ'.. తెలుగులో 'అరణ్య'.. తమిళ్ లో 'కాదన్' అనే పేరుతో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. మావటి వాడి పాత్రలో రానా దగ్గుబాటి నటించాడు. కజిరంగ, అస్సోమ్‌ ప్రాంతాల్లో ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా మనుషులు ఆక్రమించుకోవడం వలన ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు అంకితం చేసిన వ్యక్తి పాత్రలో రానా దగ్గుబాటి నటించాడు.

టీజర్ చూస్తుంటేనే ఎంతో ప్రామిసింగ్ గా ఉందని.. అలాగే అడవులను, వన్య ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత మనమందరి మీద ఉందని చెప్పే చిత్రమే 'అరణ్య' అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story
Share it