కశ్మీర్‌లో మంచు వర్షం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఎంతో శ్రమించి వేసుకున్న పంటలు దెబ్బతింటుండటంతో… రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్ముకశ్మీర్‌ ప్రాంతం లోని పుల్వామా, షోపియాన్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ మంచు కురుస్తుండటంతో ఆపిల్ తోటలు దెబ్బతిన్నాయి.

పండ్లు చేతికొచ్చే సమయానికి మంచు కురుస్తుండటంతో అవి చెట్ల నుండి రాలిపోతున్నాయి.

కశ్మీర్‌ లో10 లక్షల ఎకరాల్లో చేసే ఆపిల్ సాగు ఏటా రూ.8 వేల కోట్ల ఆదాయం, 35 లక్షల జనాభాకు జీవనోపాధి కల్పిస్తోంది.

అయితే ఈ ఏడాది మంచు విపరీతంగా కురుస్తుండటంతో చాలా చోట్ల పండ్లు చెట్టు నుంచి రాలి పోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మంచి వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు నష్టపోయారని చెప్తున్న అటవీశాఖ అధికారులు కేంద్రం నుంచి రైతులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అసలే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంతకాలం రవాణా వ్యవస్థ స్తంభించడంతో యాపిల్ వ్యాపారం దెబ్బతింది.

ఇప్పుడు మంచు కూడా తమని కోలుకోలేని దెబ్బకొడుతోంది అని రైతులు వాపోతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.