అమరావతి:'వైఎస్ఆర్ రైతు భరోసా' పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి అమలు కానున్న ఈ పథకానికి రెండు రోజులు ముందుగానే నిధులు విడుదల చేసింది. రూ. 5వేల 510 కోట్ల రూపాయలను వైఎస్ జగన్ సర్కార్ విడుదల చేసింది. అర్హత కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లలో నిధులు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.