'బిల్డ్ ఏపీ' మిషన్‌కు రంగం సిద్ధం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2019 10:51 AM IST
ముఖ్యాంశాలు
- ఇటీవలే బిల్డ్ ఏపీ మిషన్‌ను ఆమోదించిన కేబినెట్
- ఎన్‌బీసీసీతో ఎంవోయూ కుదుర్చుకోనున్న బిల్డ్ ఏపీ
అమరావతి: బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ అమలు కోసం ముసాయిదా అవగాహనా ఒప్పందాన్ని రాష్ట్రం ప్రభుత్వం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఎంవోయూను కుదుర్చుకోనుంది. ప్రభుత్వం తరఫున ఎంవోయూను కుదుర్చుకునేందుకు బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే బిల్డ్ ఏపీ మిషన్‌ను రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఎన్‌బీసీసీ భాగస్వామ్యంతో బిల్డ్ ఏపీ మిషన్ అమలు కానుంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం ప్రభుత్వం ఒప్పందం చేసుకొనుంది.
మౌలిక సదుపాయాలు కల్పించి సదురు భూములను విక్రయించడం ద్వారా వచ్చిన నిధులతో నవరత్నాలను ప్రభుత్వం అమలు చేయనున్నారు.
భూముల విక్రయం ద్వారా వచ్చిన నిధులతోనే జిల్లా, మండల, గ్రామ సచివాలయాల కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టనున్నారు.
బిల్డ్ ఏపీ మిషన్ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు, సంస్థలు యూనివర్సిటీల పరిధిలోని భూములను జిల్లా ప్రణాళిక అమలు సంఘం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆ సంస్థలకు చెందిన భూముల యాజమాన్య హక్కులను జిల్లా ప్రణాళిక సంఘానికి బదలాయించేలా నిబంధనల్ని మార్చాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
భూముల వివరాలను ఎన్‌బీసీసీ అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.