ఆ కీచ‌క ప్రొఫెసర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొండి : సీఎం జగన్

By Medi Samrat
Published on : 11 Oct 2019 2:53 PM IST

ఆ కీచ‌క ప్రొఫెసర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొండి : సీఎం జగన్

తూర్పుగోదావరి : రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్‌ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్ సీరియ‌స్ అయ్యారు. బాధిత విద్యార్థినుల లేఖకు స్పందించిన సీఎం వైఎస్ జగన్.. కఠిన చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. యూనివర్పిటీలోని ఎంఏ ఇంగ్లీష్ విద్యార్థినులను డిపార్ట్‌మెంట్ హెడ్‌ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వేధింపులకు గురి చేశాడు.

స్పెషల్‌ క్లాసుల కోసం తన ప్లాటుకు రావాలంటూ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడు. తనపై ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారి ప్రాజెక్టులను ఆపేస్తానని.. పాస్‌ కాకుండా చేస్తానని బెదిరించేవాడని తెలుపుతూ విద్యార్థినులు వాపోయారు. తక్షణమే విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్ అధికారులను ఆదేశించారు.



Next Story