ఏపీ పంచాయతీ అభ్యర్ధులకు మరో ఛాన్స్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 7:07 AM GMT
ఏపీ పంచాయతీ అభ్యర్ధులకు మరో ఛాన్స్..!

అమరావతి: సచివాలయ ఉద్యోగుల పట్ల ఏపీ ప్రభుత్వం మంచి మనసుతో వ్యవహారిస్తోంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులు కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లోహాజరుకాకపోయినా మరో చాన్స్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఒరిజినల్ సర్టిఫికె్ట్స్ ఇవ్వకపోయినా మరో అవకాశం ఇవ్వాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జిల్లా సెలక్షన్‌ కమిటీలను ఆదేశించారు.

రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా లిప్ట్ రెడీ అవుతుంది. జిల్లా సెలక్షన్‌ కమిటీలు షార్ట్‌ లిస్టు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఇప్పటికే శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతోపాటు మరో రెండు, మూడు జిల్లాల్లో షార్ట్ లిస్ట్‌లు కూడా రెడీ అయ్యాయి. ఎంపికైన అభ్యర్ధుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్ పద్ధతిలో సమాచారం పంపుతున్నామని అధికారులు చెప్పారు.

Next Story
Share it