కరోనా కష్టకాలంలో ఏపీ రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త చెప్పింది జగన్‌ ప్రభుత్వం. రోడ్డు ట్యాక్స్‌ కట్టేందుకు గడువు పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో రోడ్డు ట్యాక్స్‌ కట్టేందుకు ఇచ్చిన గడువు శుక్రవారం తో ముగిసింది.

అయితే లాక్‌డౌన్‌ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్‌ దృష్టికి వచ్చింది. దీంతో రోడ్డు ట్యాక్స్‌ గడువు సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనుంది.

సుభాష్

.

Next Story