సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ఏపీలో నాలుగు జోన్లు..!

By సుభాష్  Published on  3 Aug 2020 6:59 AM GMT
సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ఏపీలో నాలుగు జోన్లు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదముద్ర వేయడంతో జగన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఆర్డీయేని రద్దు చేసి అమరావతి రీజినల్ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని భావిస్తున్నారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి వాటికి చైన్మన్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే ముందు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఉత్తరాంధ్రలో విశాఖలో పాలనా రాజధాని రానుండడంతో విజయనగరంపై ఫోకస్ పెట్టారు. అలాగే కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రం కానుంది. రాష్ట్రంలో పంటలు, ఆక్వా, సహజవాయువులు, వనరులతో రెండు జిల్లాలు పరిపూర్ణంగా ఉన్నాయి. భారీగా ఆదాయం కూడా ఇక్కడినించే వస్తోంది. దీంతో కాకినాడకే ఓ జోన్ కేటాయించారు.

ఇక అమరావతిని శాసన రాజధానిగా ఉంచడంతో గుంటూరును రాయలసీమకు కడపను జోన్‌గా నిర్ణయించారు. నాలుగు జోన్లుగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం వున్న ఆర్థిక సంక్షోభం సమయంలో ఈజోన్ల అభివృద్ధికి ఎలాంటి నిధులు సమకూరుస్తారో చూడాలంటున్నారు ఆర్థికరంగ నిపుణులు.

Next Story