జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు..!
By సుభాష్ Published on 21 May 2020 7:26 AM ISTడిల్లీ: ప‌్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా రద్దు అయిన సాధారణ రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు జూన్ 1 నుంచి రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా, జూన్ 1వ తేదీ నుంచి నడుపుతున్న రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు నడిచే రైళ్ల జాబితాను విడుదల చేసింది రైల్వే.
మే 21న ఉదయం 10 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు నడిచే రైళ్లు
► ముంబై సీఎస్టీ - హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్
► హౌరా - సికింద్రాబాద్, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్
► న్యూఢిల్లీ - హైదరాబాద్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్
► దనపూర్ (పాట్నా)-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
► గుంటూరు - సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్
► తిరుపతి - నిజామాబాద్, రాయలసిమ ఎక్స్‌ప్రెస్
► హైదరాబాద్ - విశాఖ, రాయలసీమ ఎక్స్‌ప్రెస్
► సికింద్రాబాద్ - నిజాముద్దీన్ నాన్ ఏసీ
ఇక సాధారణ సీట్లకు రిజర్వేషన్
ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి బోగీలలో కూడా రిజర్వేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సీట్ల రిజర్వేషన్ ఉండే జనరల్ కోచ్‌లకు సెకండ్ క్లాస్ సీట్ల రుసుము వసూలు చేయనున్నారు. ఈ రైళ్లలో రిజర్వేషన్ లేని బోగీలేవి ఉండవని రైల్వేశాఖ తెలిపింది. అన్ని టికెట్లకూ ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా గానీ, యాప్ ద్వారా గానీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకునే సదుపాయం ఉండదు. రైల్లోనూ ఎవ్వరికీ టికెట్లు జారీ చేయరు. 30 రోజుల ముందే టికెట్ తీసుకునే సదుపాయం ఉంటుంది. ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా రూల్స్ ప్రకారమే అందజేస్తారు. అలాగే తత్కాల్ టికెట్లు ఉండవు.
�