మతపెద్దలను ఆదుకునేందుకు ఏపీ ప్రత్యేక జీఓ

By రాణి  Published on  21 April 2020 5:08 PM IST
మతపెద్దలను ఆదుకునేందుకు ఏపీ ప్రత్యేక జీఓ

కరోనా కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఆఖరికి దేవాలయాలు, చర్చిలు, మసీదులు సైతం ఇప్పుడప్పుడే తెరుచుకునే వీలు కనిపించడం లేదు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను ఇళ్లలోనే జరుపుకున్నారు ప్రజలు. ఇప్పుడు రంజాన్ ప్రార్థనలు కూడా ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వాలతో పాటు మత పెద్దలు సైతం పిలుపునిచ్చారు.

Also Read : వైద్యుల నిర్లక్ష్యం..విడిపోయిన బిడ్డ తల, మొండెం

కరోనా కష్టకాలంలో ఎవ్వరికీ ఉపాధి లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఉద్యోగులకు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి సగానికి పైగా జీతాలు ఆగిపోయాయి. ఇక ప్రార్థనా మందిరాలన్నీ మూతపడటంతో వాటిలో దైవ కార్యక్రమాలు చేస్తున్నవారికి సైతం ఆదాయం లేదు. అందుకే అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్లకు రూ.5000 ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది జగన్ సర్కార్. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. కానీ..ప్రభుత్వాధీనంలో ఉన్న వాటిలో పనిచేస్తున్న వారికి జీతం వస్తుంది కాబట్టి అలాంటి వారికి ఈ పథకం వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. గుర్తింపు పొందిన వాటిలో పనిచేస్తున్న వారితో పాటే గుర్తింపు పొందని వాటిలో దైవ కార్యక్రమాలు చేస్తున్న వారికి కూడా ప్రభుత్వం తరపున ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఆదేశాలిచ్చింది.

Also Read :హైదరాబాద్‌లో చిరుత సంచరిస్తోందా ?

Next Story