ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: సౌర విద్యుత్‌ కేంద్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌

By సుభాష్  Published on  18 Sep 2020 2:30 AM GMT
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: సౌర విద్యుత్‌ కేంద్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ప్రభుత్వం. తొలిదశలో 10 ప్రాంతాల్లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీ జీఈసీఎల్ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో టెండర్‌ డాక్యుమెంట్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఉంచినట్లు తెలిపింది. అయితే జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఆమోదం తర్వాత టెండర్లను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయ ఇతే వ్యవసాయ, బీడు భూముల్లో సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్‌ పథకం కింద రైతులు సొంతంగా వారి భూముల్లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story