ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

By సుభాష్  Published on  17 Sep 2020 1:24 PM GMT
ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 77,492 మందికి కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 8,702 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. కొత్తగా 72 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 5,177కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు ఆరు లక్షలు దాటేసింది.

గడిచిన 24 గంటల్లో..

పాజిటివ్‌ కేసులు - 8,702

మరణాలు - 72

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 10,712

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య - 601462

మొత్తం మరణాల సంఖ్య - 5,177

యాక్టివ్‌ కేసుల సంఖ్య - 88,197

మొత్తం డిశ్చార్జ్‌ సంఖ్య - 5 లక్షల,8,088

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు -88,197

కాగా, తాజాగా మరణించిన వారు చిత్తూరు జిల్లాలో 12 మంది కాగా, ప్రకాశం 10, కడప 7, గుంటూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, తూర్పు గోదావరి 5, కృష్ణ 5, అనంతపూర్‌ 4, విశాఖ 4, పశ్చిమగోదావరి 4, శ్రీకాకుళం 2, విజయనగర్‌ జిల్లాలో 1 చొప్పున మరణించారు.Next Story
Share it