ఏపీ ఆర్టీసీ బస్సుల్లో కొత్త విధానం..!

By సుభాష్  Published on  3 May 2020 11:46 AM GMT
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో కొత్త విధానం..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీనే వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గనా.. ఏపీలో మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చింది. రెడ్‌ జోన్‌లు మినహా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో చాలా వరకూ సడలింపులు ఇచ్చింది. ఆ ప్రాంతాల్లో బస్సు సర్వీసులు కూడా నడుపుకోవచ్చని సూచించింది.

అయితే గ్రీన్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో బస్సులు నడిచే అవకాశాలున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆదివారం సాయంత్రం వరకూ ఆయా రూట్లపై తగిన ప్రణాళిక సిద్దం చేసి సోమవారం నుంచి బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బస్సుల్లో సిట్టింగ్‌లో నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణం సమయంలో మాస్క్‌ తప్పనిసరి చేయనుంది. ఎవరికి కేటాయించిన సీట్‌లోనే వారే కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈ విధానం కొన్ని నెలల పాటు అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

Next Story
Share it