ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు... కిలోమీటర్‌కు ఎంతంటే..!

By Newsmeter.Network  Published on  7 Dec 2019 4:27 PM GMT
ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు... కిలోమీటర్‌కు ఎంతంటే..!

తెలంగాణలో పెరిగిన బస్సు ఛార్జీల సెగలు ఏపీకి తాకాయి. ఏపీలోబస్సుఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శనివారం రోడ్లు, భవనాలశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. పల్లె వెలుగు.. సిటీ సర్వీస్‌ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ. 10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెకించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల్లోకూరుకుపోయిందని మంత్రి నాని ఆరోపించారు. ఆ నష్టాలను పూడ్చేందుకే బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీ దివాళా తీయడానికి గత ప్రభుత్వమే కారణమని, రాష్ట్ర ప్రజలకు ఏదో చేశామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప, చేసిందేమి లేదని విమర్శించారు. ఆర్టీసీకి ప్రతియేటా రూ. 1200 కోట్ల నష్టం వస్తోందని, ఇప్పటికే ఆర్టీసీ రూ.6735 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. 2017-19 పీఆర్సీ పెంచడంతో సంస్థకు భారంగా మారిందని, 2015 నుంచి లీటర్‌ డీజిల్‌పై అదనంగా పెరిగిన రూ.20 భారం సంస్థపై పడుతోందన్నారు. ఆర్టీసీని బతికించాలనే చార్జీలను పెంచక తప్పడం లేదన్నారుఉ. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమలు అవుతాయో త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story