స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఏపీ
By రాణి Published on 13 April 2020 4:01 PM GMTఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతుందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది. ఇందుకు బలం చేకూరుస్తూ కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ కనకరాజ్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే అవకాశముందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఎస్ఈసీ సూచించడం కొసమెరుపు.
Also Read : వీసా గడువు పెంచిన కేంద్రం..హోంమంత్రిత్వ శాఖ వెల్లడి
ఇందుకేనా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆగమేఘాల మీద కనకరాజ్ ను చెన్నై నుంచి పిలిపించి మరీ బాధ్యతలు అప్పగించిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించవచ్చన కనకరాజ్ సూచనలు మళ్లీ రాజకీయ దుమారానికి తెరలేపే విధంగా ఉంది.
Also Read : రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ల టోకరా
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు పట్టించుకోని ముఖ్యమంత్రి..ఎంత సేపు తన స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అలాగే ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు మంత్రులు కరోనాను అరికట్టడంలో ఏపీ ముందంజలో ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం రిలీఫ్ ఫండ్ కు వస్తున్న విరాళాలను ఏ రకంగా ఖర్చు పెడుతున్నారో ఇంత వరకూ ఎవరికీ తెలీదు. అధికారికంగా 16 కోట్లమాస్కులు, డాక్టర్లకు పీపీఈలను ఇస్తున్నారు. అలాగే కేంద్రం ఇచ్చిన రూ.1000 ప్రజలకు అందజేశారు. తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ ఇచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలా ? మీరు చెప్తే మేం వినాలా ? అన్నట్లు ప్రభుత్వ ధోరణి ఉందని వైసీపీ మద్దతు దారులో ఆరోపిస్తున్నారు.
Also Read : ఏపీ కొత్త ఎస్ఈసీపై దుష్ప్రచారం