బిగ్ బ్రేకింగ్..ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 11:27 AM GMT
బిగ్ బ్రేకింగ్..ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్

ముఖ్యాంశాలు

  • ఏపీ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
  • రెడీ అంటూ కోర్ట్ కు తెలిపిన ఏపీ ప్రభుత్వం
  • తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా

ఇక ఏపీలో మరో అంకానికి రంగం సిధ్ధం అయ్యింది. ఇక ఏప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఏన్నికలకు రంగం సిధ్ధం అయ్యింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో జరిగే గ్రామ స్థాయి ఏన్నికలు రాబోతున్నాయి.ఇక హైకోర్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారీటి ఇచ్చింది.రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు స్పష్టం చేశారు.

అయితే, ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

బీసీలకు 34శాతం, ఎస్సీలకు 19.08శాతంఎస్టీలకు 6.77శాతం కోటా ఉంటుందని చెప్పారు. ఇక ఇప్పుడు ప్రతి పక్షాలు కూడా ఏన్నికలకు సిధ్ధం అవుతాయి అనడంలో ఏటువంటీ సందేహం లేదు.

Next Story