బంగారం స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు

By అంజి
Published on : 24 Nov 2019 6:51 PM IST

బంగారం స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు

విజయవాడ: నగరంలో బంగారం స్మగ్మింగ్‌ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఇబ్రహీంపట్నంలో బంగారం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3.18 కోట్ల విలువైన 8.86 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారు నగలను సీపీ తిరుమలరావు పరిశీలించారు. ట్యాక్స్‌లు చెల్లించకుండా, బిల్లులు లేకుండా బంగారాన్ని తరలించడంపై కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story