ఏపీలో కొత్తగా 462 పాజిటివ్ కేసులు.. 8 మంది మృతి
By సుభాష్ Published on 23 Jun 2020 2:01 PM ISTఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,639 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 462 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 407 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మంది.. 15 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9834కు చేరింది.
ఇక గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు చొప్పున మొత్తం 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ 119 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకూ కరోనా నుంచి 4592 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5123 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక తాజాగా 129 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక తాజాగా 24 గంటల్లో ఎక్కడ ఎన్ని కేసులు:
అనంతపురం -68
చిత్తూరు - 26
ఈస్ట్ గోదావరి - 87
గుంటూరు - 50
కడప - 24
కృష్ణ - 33
కర్నూలు -53
నెల్లూరు - 7
ప్రకాశం - 5
శ్రీకాకుళం - 1
విశాఖ - 21
విజయనగరం - 1
వెస్ట్ గోదావరి - 31 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎన్ని కేసులు
కర్నూలు - 1407
కృష్ణా -1096
అనంతపురం - 938
గుంటూరు - 852
ఈస్ట్ గోదావరి - 706
వెస్ట్ గోదావరి -635
చిత్తూరు - 617
నెల్లూరు - 484
కడప - 454
విశాఖ - 326
ప్రకాశం - 192
విజయనగరం - 91
శ్రీకాకుళం - 60
ఇతర - 55
మొత్తం కేసులు -9834