ఇస్లాం, ముస్లిం విద్వేష ప్రచారాలు చేస్తే జైలుకే..

By రాణి  Published on  16 April 2020 2:40 PM GMT
ఇస్లాం, ముస్లిం విద్వేష ప్రచారాలు చేస్తే జైలుకే..

ఇస్లాం, ముస్లిం సోదరులపై, ముస్లిం స్వచ్ఛంద సేవా సంస్థలపై బురద చల్లేలా ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని అన్యమత పోస్టులు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి గురువారం విజయవాడ సీపీ ద్వారకా తిరుమలకు ఫిర్యాదు చేసింది. కరోనా వ్యాప్తి పేరుతో ముస్లిం లకు, జమాతే ఇస్లామీ సంస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా కొందరు ఫేక్ ఐడీలతో అన్యమతాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షి బ్లీ, జమాత్ ఇస్లాం రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మెద్, జమీయతె ఉలేమా రాష్ట్ర కన్వీనర్ మౌలానా హుస్సేన్, ముస్లిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎండీ ఫతాఉల్లాహ్ ఆధారాలతో సహా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని, రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కాపాడాలని కోరారు. ఇలాంటి వారి వల్ల మనదేశ సమగ్రత ,జాతీయ సమైక్యత భావనలు దెబ్బతింటాయని, మనదేశ లౌకిక స్పూర్తి కి విఘాతం కలిగిస్తాయని వారు అభిప్రాయ పడ్డారు.

రోగ నిరోధక శక్తి కోసం బత్తిని చూర్ణం వాడుతున్నారా ? ఇదొక్కసారి చూడండి..

తాము అన్యమతానికి వ్యతిరేకం కాదని, జమాతే ఇస్లామీ హింద్, జమియతె ఉలేమా సంస్థల ద్వారా భారతీయుల మధ్య సోదర భావాన్ని, మతసామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తమ సంస్థలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని సీపీకి వివరించారు.

మే 3 వరకూ శ్రీవారి దర్శనం రద్దు..31 వరకూ ఆర్జిత సేవలు కూడా..

Next Story
Share it