మే 3 వరకూ శ్రీవారి దర్శనం రద్దు..31 వరకూ ఆర్జిత సేవలు కూడా..
By రాణి Published on 16 April 2020 11:13 AM GMT
మే 3వ తేదీ వరకూ శ్రీవారి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. అలాగే మే 31వ తేదీ వరకూ అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది టిటిడి. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు టికెట్లు బుక్ చేసుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నంబర్ తో పాటు ఐఎఫ్ఎస్ సీ కోడ్, టికెట్ల వివరాలను [email protected] కి పంపించాల్సిందిగా సూచించింది. టికెట్లు బుక్ చేసుకున్న వారి అమౌంట్ వీలైనంత త్వరగా రీఫండ్ చేస్తామని తెలిపింది.
Also Read : పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..72 మంది స్వీయ నిర్బంధంలోకి
ఏప్రిల్ 14వ తేదీ వరకూ స్వామి వారి దర్శనాలుండవని ప్రకటించిన టిటిడి ఇప్పుడు లాక్ డౌన్ గడువును పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. స్వామివారికి మాత్రం నిత్య పూజా కైంకర్యాలు మాత్రం యథావిధిగా సాగుతాయి. మరోవైపు లాక్ డౌన్ తో అల్లాడుతున్న అన్నార్తులకు టిటిడి నిత్యం వేలాది ఆహార పొట్లాలను పంపిణీ చేస్తోంది. మామూలు రోజుల్లో కొండపై భక్తులకు ఉచిత అన్నదానం ఎలాగూ చేసే టిటిడి..ఇప్పుడు కొండ దిగువనున్న అన్నార్తుల ఆకలి తీరుస్తోంది.
Also Read : 20 లక్షలు దాటిన కరోనా కేసులు