ఏపీలో పెరిగిన మద్యం ధరలు.. దేనిపై ఎంత

By సుభాష్  Published on  4 May 2020 4:06 AM GMT
ఏపీలో పెరిగిన మద్యం ధరలు.. దేనిపై ఎంత

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. దీంతో మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిపిందే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో మద్య షాపులు తెరుచుకోవచ్చని తెలిపింది. అది కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ, షాపుల వద్ద ఒకే సారి ఐదుగురికి మించి ఉండకూడదని నిబంధనలు విధించింది.

ఇక ఏపీలో సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు మందుబాబులకు భారీ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మధ్య ధరలు పెంపుతో ప్రభుత్వ ఖజానాకు రూ. 4,400కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా. సీఎం జగన్‌ నేతృత్వంలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో మద్యం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బార్లు, పబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్‌ లైసెన్స్‌తో నడిచే కేంద్రాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి

రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.20 పెంపు

హాఫ్‌ బాటిల్‌పై రూ. 40

ఫుల్‌ బాటిల్‌పై రూ. 80

రూ. 120-150కిపైగా ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.60 పెంపు

హాఫ్‌ బాటిల్‌పై రూ. 80

ఫుల్‌బాటిల్‌పై రూ 240

మినీ బీర్‌పై - 20

ఫుల్ బీర్‌పై రూ. 30 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక గ్రీన్‌ జోన్‌లలో లిక్కర్‌ షాపులు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో మద్యం షాపులు తెరుచుకోనుండగా, తెలంగాణాలో మాత్రం వైన్ షాపులు తెరిచేందుకు నో చెప్పింది ఎక్సైజ్‌ శాఖ.

మద్య షాపుల సమయాలు:

ఇక ఏపీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. షాపు వద్దకే ఒకే సారి కేవలం ఐదుగురు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మాస్క్‌లు లేకపోతే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్‌ పేర్కొన్నారు.

Next Story