సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో గవర్నర్‌ తమిళసై..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 12:41 PM IST
సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో గవర్నర్‌ తమిళసై..!

అనంతపురం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 94 వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. బెంగుళూరు నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్ తో తమిళసై పుట్టపర్తి చేరుకున్నారు. జయంతి వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. గవర్నర్ తమిళసైకి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ సభస్మందిరంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకొని అనంతరం జరిగే అంతర్ జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొని గవర్నర్‌ తమిళ్‌ సై ప్రసంగంచనున్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై చర్చించనున్నారు.

Next Story