బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్‌లోని వాల్డార్ఫ్‌ అస్టోరియా హోటల్‌లో నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. కాగా ఈ వేడుకలకు పలు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా సీఎం రమేష్‌ భారత్‌ నుంచి 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిశ్చితార్థ వేడుక‌లో సీఎం ర‌మేష్ కుమారుడు రిత్విక్, కోడ‌లు పూజ డ్యాన్స్ ల‌తో అదర‌గొట్టారు. కాగా ఎంపీ సీఎం ర‌మేష్ కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌న స‌తీమ‌ణితో డ్యాన్స్ చేస్తూ అంద‌రిలోనూ జోష్ పెంచారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పాట‌కు స్టెప్పులేసిన సీఎం ర‌మేష్.. అంద‌ర్నీ ఉత్సాహ‌ప‌రిచారు. అత్తారింటికి దారేది సినిమాలోని బాపుగారి బొమ్మ సాంగ్ కు సీఎం ర‌మేష్ డ్యాన్ చేశారుప‌. కాగా డ్యాన్స్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.