గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. కారులో తరలిస్తుండగా..!
By అంజి Published on : 25 Nov 2019 2:41 PM IST

గుంటూరు: తాడేపల్లి లోటస్ హోటల్ వద్ద గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. రెండు కిలోల 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్విప్ట్ కారులో గంజాయితో నలుగురు యువకులు పట్టుబడ్డారు. యువకులు హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. యువకులపై కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.
Next Story