అలా చేస్తే ఇంటి యజమానులపై చర్యలు తీసుకోండి : ఏపీ హై కోర్టు
By రాణి Published on 11 April 2020 7:05 PM ISTకరోనా బాధితులకు వైద్య సేవలందించడంలో నిమగ్నమై వైద్యులు రాత్రనకా, పగలనకా కుటుంబాలను వదిలేసి ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. కొందరు వైద్యులకైతే కనీసం ఇంటి అలకెళ్లే సమయం కూడా లేక తమ వాహనాలు..క్యాబిన్లలోనే నిద్రపోతున్నారు.
Also Read : లాక్ డౌన్ కొనసాగాలి..ఆర్థిక చక్రం కదలాలి : ప్రధానికి జగన్ విజ్ఞప్తి
వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను హై కోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేసింది. వైద్యుడు దేవుడితో సమానం. అలాంటి వైద్యులు అద్దెకుంటున్న ఇళ్లను ఏ ఇంటి యజమానులైనా ఖాళీ చేయాలని డిమాండ్ చేసినా, బెదిరించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ హై కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైద్య సిబ్బందికి పీపీఈలు, మాస్క్ లు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో హై కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు పూర్తిగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read : నేను ఇంతమందిని చూసి 20 రోజులైంది : విజయ్ దేవరకొండ
ప్రజా సంచార ప్రాంతాలైన మార్కెట్లు, రైతు బజార్లు, కోర్టు ఆవరణలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శానిటైజేషన్, క్రిమి సంహారక టన్నెల్స్ ఏర్పాట్లపై వారం రోజుల్లోగా వివరణివ్వాల్సిందిగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడంలో తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా చూడాల్సిన బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కి అప్పగించింది. అలాగే ‘బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్’ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో కాటన్, సిరంజిలు, సెలైన్ బాటిల్స్ వంటి వ్యర్థాలను నిర్వీర్యం చేయాల్సిందిగా హై కోర్టు స్పష్టం చేసింది.