నేను ఇంతమందిని చూసి 20 రోజులైంది : విజయ్ దేవరకొండ

By రాణి  Published on  11 April 2020 8:43 AM GMT
నేను ఇంతమందిని చూసి 20 రోజులైంది : విజయ్ దేవరకొండ

  • పోలీస్ ఫోర్స్, డాక్టర్స్ ఫెడరేషన్ కు కృతజ్ఞతలు చెప్పిన విజయ్

కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు నిరంతరం కృషి చేస్తూ..మనకు రక్షణ కవచంలా నిలబడుతోన్న పోలీసులను టాలీవూడ్ హీరో విజయ్ దేవరకొండ అభినందించారు. పోలీసులను అభినందించేందుకే తాను 20 రోజుల తర్వాత ఇంటి నుంచి బయటికొచ్చినట్లు తెలిపారు. క్లిష్ట సమయంలో కుటుంబాలను వదిలి..ప్రజలకై కృషి చేస్తోన్న పోలీసుల గురించి విజయదేవరకొండ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

'' మన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు చెప్తున్నా. మనమంతా ఇంత సేఫ్ గా ఉండేందుకు పోలీసులు కృషి చెప్పలేనిది. ఇండియాలో లాక్ డౌన్ ను ఇంత సక్సెస్ ఫుల్ గా చేశారంటే అది కేవలం పోలీసుల వల్లే సాధ్యమైంది. లాక్ డౌన్ వల్ల నేను ఇంత మంది మనుషులను చూసి 20 రోజుల పైన అవుతోంది. లాక్ డౌన్ ను పోలీసులు ఇంత కఠినంగా అమలు చేయకపోయినా, ప్రభుత్వాలు అప్రమత్తమవ్వకపోయినా మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని మనకు తెలుసు. మన జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే మనం వారిపై బడ్డెన వేయకుండా ఇళ్లకే పరిమితమవుదాం. ఎంత తక్కువ సంఖ్యలో రోడ్లపైకి వస్తే అంత మంచిది. మనం కూడా వారికి సహకరించాలి. కానీ లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసేవారు కూడా పోలీసులు, డాక్టర్ల సేవలను గుర్తించాలి. చాలామందికి తిండి లేదు. ఉద్యోగాలు పోయాయి. మీరు టైం పాస్ కోసం రోడ్లపై తిరగొద్దు. ఇంట్లో ఉన్నవారందరికీ, ప్రభుత్వానికి, తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ కు నా కృతజ్ఞతలు.''

తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ పోలీసులకు గ్లాస్ షీల్డ్స్ ను అందజేస్తోంది. నిత్యం లాక్ డౌన్ విధుల్లో భాగంగా పోలీసులు చాలామందితో మాట్లాడాల్సిన పరిస్థితి. వారి ద్వారా పోలీసులకు సైతం వైరస్ వ్యాపించే అవకాశాలుండటంతో ఈ షీల్డ్స్ అందజేస్తున్నట్లు తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ తెలిపింది.

Next Story